ఏపీలో రైతులు, సామాన్యుల దుస్థితిపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు లేక అన్నదాతల ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. సామాన్య ప్రజలేమో తాగు నీరు దొరక్క వలస వెళ్లిపోతున్నారని ఎక్స్ వేదికగా సత్యకుమార్ పేర్కొన్నారు. గుక్కెడు మంచి నీళు అడగడమే జగన్ పాలనలో నేరమైందని.. దానికే కేసులు, హత్యలు చేస్తున్నారన్నారు. వీళ్లను ఇలాగే వదిలేస్తే చివరకు జగన్ బ్రాండ్ మద్యం మాత్రమే తాగి దాహం తీర్చుకోవాలని అడ్డంగా వాదించి జీవో కూడా తేస్తారేమోనని సత్యకుమార్ అన్నారు.