‘మీ బిడ్డనంటున్నాడు... జర జాగ్రత్త ప్రజలారా..’ అంటూ ఎక్స్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. జగన్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని ‘జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాళ!’ అని పేర్కొన్నారు. గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే... అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని నారా లోకేష్ అన్నారు.