జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బీజేపీతో పొత్తుపై పెద్దలతో మంతనాలు జరపనున్నట్లు సమాచారం. తిరిగి వచ్చిన తర్వాత మంగళగిరిలోని తన నివాసంలో రెండో జాబితాపై పవన్ కసరత్తు చేయనున్నారు. రెండు మూడు రోజుల్లో మరో పది పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కాగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో బీసీ జయహో బహిరంగ సభ మంగళవారం, మంగళగిరిలో జరగనుంది. ఈ సదస్సుకు చంద్రబాబు, పవన్, లోకేష్ హాజరవుతారు. ఈ సభ ద్వారా బీసీ డిక్లరేషన్ ఉమ్మడిగా ప్రకటించనున్నారు. సభను జయప్రదం చేయాలని జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి, బీసీ సగర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు. బడేటి క్యాంపు కార్యాలయంలో సోమవారం బీసీ నేతల సమావేశం జరిగింది. జయహో సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారన్నారు. టీడీపీకి బీసీలే వెన్నెముకని, బీసీలంటేనే టీడీపీ అన్నారు. జగన్ ప్రతీ బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు లేకుండా చైర్మన్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీలపై దాడులు అధికమయ్యాయన్నారు. బీసీ కులాలకు న్యాయం జరగా లంటే టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాలన్నారు.