వచ్చే ఎన్నికల్లో అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనం పడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని గజపతినగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. డోలపాలెం గ్రామంలో ఆయన సోమవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ప్రజా మద్దతులో తనను ఆదరించి గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్ పథకాలను గ్రామస్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, శీర అప్పలనాయుడు, బొడ్డు రాము, పడాల అప్పలనాయుడు పాల్గొన్నారు.