చిత్తూరు జిల్లా కార్వేటి నగరం వద్ద ఒక కోటి తొమ్మిది లక్షల 44 వేల, 200 రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీలలో భాగంగా నగదు పెద్ద ఎత్తున పట్టుబడింది. కార్వేటి నగరంలో సోమవారం రాత్రి పోలీసులు తమ విధులలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎస్సై వెంకటకృష్ణ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా 1 కోటి 9 లక్షల,44 వేల 200 రూపాయల నగదును తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. నగిరి డీఎస్పీ పవన్ కుమార్ కార్వేటి నగరం సర్కిల్ సీఐ సత్య బాబు ఆధ్వర్యంలో తిరుపతి ఇన్కమ్ టాక్స్ అధికారులకు నగదు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్కే పేట నుంచి పుత్తూరుకు తరలిస్తున్న సుందరం సుధాకర్ అనే వ్యక్తికి చెందిన నగదును పోలీసులు పట్టుకున్నారు.