విజన్ వైజాగ్ సదస్సులో రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల తరువాత తాను విశాఖలో ఉంటానని సీఎం చెప్పారు. మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా తాను విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. తాను విశాఖ వచ్చేందుకు అనేకసార్లు ప్రయత్నించిన రానివ్వలేదని తెలిపారు. కోర్ట్ కేసులు, కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేశాయన్నారు. భూ కబ్జాలు, అరాచకాలు అని ప్రచారం చేశారని మండిపడ్డారు. సీఎం వైజాగ్‌లో ఉంటే విశాఖ బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను ఒక్కడినే విశాఖను కార్యనిర్వహక రాజధానిగా చేయాలనుకున్నానని.. ప్రతిపక్షం మొత్తం వ్యతిరేకించిందని తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు అవుతుందని టీడీపీ ప్రభుత్వమే చెప్పిందంటూ జగన్ తెలిపారు.