ఎంపీ భరత్ తనకు కుమారుడితో సమానంగా భావిస్తానని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. అయన మాట్లాడుతూ...... ‘‘చెప్పు తీస్తే గొప్పవాడివి అయిపోతానని అనుకుంటున్నావా..నీ స్థాయి ఎంత..? వాలంటీర్‌తో గౌరవంగానే మాట్లాడాను.. నా కుమారుడికి టికెట్ రావడంతో ఎంపీ భారత్‌కు మతిపోయింది.. భరత్ విషయాలు బయట పెట్టాలంటే చాలా ఉన్నాయి.. భరత్ ప్రవర్తన చాలా నీచమైనది.. ఎంపీగా ఉండి ఆరు నియోజవర్గాలు గాలికి వదిలేసారు.. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో పర్యటిస్తే ఎంపీకి ప్రజలు చెప్పు చూపిస్తారు.. ఎంపీ భరత్ ఫెయిల్యూర్ హీరో.. రాజమండ్రిలో సినిమా సెట్టింగులు వేశారు’’ అంటూ ఆదిరెడ్డి అప్పారావు కౌంటర్ ఇచ్చారు. కాగా ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్‌ను బెదిరించారని ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. ఓ మహిళా వాలంటీర్‌తో ఆదిరెడ్డి ఫోన్‌లో మాట్లాడిన కాల్ రికార్డును సిద్ధం సభలో వినిపించారు. ఈ సందర్బంగా ఎంపీ.. అప్పారావుకు.. చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్పందించిన టీడీపీ, జనసేన నేతలు మంగళవారం ఎంపీ భరత్‌కు కౌంటర్ ఇచ్చారు.