ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి... అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్డీ చేశారని నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం అయిన సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్... తాజాగా రాష్ట్రంలో ఖనిజసంపదను తాకట్టుపెట్టి రూ.7వేల కోట్లు అప్పు తెచ్చారన్నారు. ఇప్పటికే మందుబాబులను తాకట్టుపెట్టి 33వేల కోట్లు అప్పు తెచ్చిన జగన్ జమానాలో ఇక మిగిలింది 5 కోట్ల మంది జనం మాత్రమేనని నారా లోకేష్ అన్నారు. ఇప్పటికే తాను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదర గొడుతున్న జగన్మోహన్ రెడ్డి మాటల వెనుక అంతర్యాన్ని గుర్తించి రాబోయే 2 నెలలపాటు ఆయనతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా రాష్ట్రప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని నారా లోకేష్ తెలిపారు.