రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్న కోల్పోయామని, దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే వైజగ్ నగరం అభివృద్ది చెందుతోందని.. హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయం రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి సాధించామని సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘విజన్ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని.. అభివృద్దిలో విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది. గత పదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.