మీ బిడ్డనంటున్న సీఎం జగన్ పట్ల ప్రజలు జర జాగ్రత్తగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. ఈ మేరకు లోకేశ్ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన సొంత కంపెనీలు కళకళలాడితే రాష్ట్ర ఖజానా దివాలా తీసిందన్నారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు.