భారత్ చేపట్టబోయే తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్’లో నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి.. మూడు రోజుల తర్వాత భూమి మీదకు వస్తారు.
దీంతో వారి సురక్షిత ల్యాండింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా 48బ్యాకప్ సైట్లను గుర్తించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) వెల్లడించింది. వ్యోమగాములతో కూడిన మాడ్యూల్ అరేబియా సముద్రంలో దిగాల్సి ఉండగా.. ఏ చిన్న మార్పుకైనా సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.