కళ్యాణదుర్గం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం అనంతపురం పార్లమెంటు సభ్యులు మరియు కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఎంపీ రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ లబ్ధిదారులకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు.