రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలోని గోపులాపురం గ్రామంలో బుధవారం టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నట్లు టిడిపి పార్టీ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన కుటుంబాలను ఆమె నేడు పరామర్శించనుంది. ఒక్కో కుటుంబానికి మూడు లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.