రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో వాక్ విత్ మెట్టు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప, వైస్ చైర్మన్ ల సమక్షంలో ప్రతి గడపను సందర్శించారు. ప్రతి గడప వద్ద సాదర స్వాగతం లభిస్తోందని మెట్టు గోవిందరెడ్డి పేర్కొన్నారు. మరోసారి జగనన్నను సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.