ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
దీని ప్రకారం ఇప్పటివరకూ ఆస్తిపన్ను చెల్లించకుండా బకాయి ఉన్న వారికి ప్రయోజనం చేకూరబోతోంది. ఇప్పటివరకూ ఆస్తిపన్నుపై విధించిన వడ్డీని మినహాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే వడ్డీ మినహాయించుకుని వాస్తవ ఆస్తిపన్నును వారు చెల్లిస్తే సరిపోతుంది.