రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ప్రకటించారు. ఆ రహస్యాన్ని ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని అన్నారు.
బెంగళూరులో బుధవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, అరబైల్ శివరామ్ హెబ్బార్ కాంగ్రెస్లో చేరుతున్నారా అని మీడియా అడగగా, ఇంకా ఎక్కువ మంది పార్టీలోకి వస్తారని బదులిచ్చారు.