మంత్రి పదవికి రాజీనామా చేశాకే తాను టీడీపీలో చేరానని ఆ పార్టీ నేత గుమ్మనూరు జయరాం అన్నారు. పదవి వదులుకున్నాక బర్తరఫ్ చేసినా తనకు అనవసరమని వ్యాఖ్యానించారు.
అధినేత చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని చెప్పారు. చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. ఆలూరుకు సేవలందించా.. ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నా అన్నారు.