టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు.
ఈ భేటీలో పొత్తుపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క బుధవారం ఉదయం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ కలిశారు. ఇరుపార్టీల అభ్యర్థుల రెండో జాబితాతో పాటు, BJPతో పొత్తు అంశంపై ఇద్దరూ చర్చించారు.