వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా 4వ విడుత నిధులను ఏపీ ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరుగనున్న సభలో సీఎం జగన్ బటన్ నొక్కి మహిళల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
వైఎస్సార్ చేయూత కింద అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 ఇస్తున్నారు. నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు రూ.75 వేల సాయం అందనుంది.