హిందూపురం పట్టణంలోని 34వ వార్డు కౌన్సిలర్ నాగమణి భర్త నాగరాజు(45) పురుగుమందు తాగి బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న పాటి మనస్పర్థలు రావడంతో ఆవేశంతో నాగరాజు మంగళవారం సాయంకాలం మద్యంలోకి పురుగుమందు కలుపుకొని తాగాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.