పవన్ను తిట్టడానికి వైసీపీ బలిజలను వాడుకుందని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆరోపించారు. గత నవంబర్లో జరిగిన బస్సు యాత్రలో ప్రజల ముందు నన్నే ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పారు. టికెట్ నాకేనని డిసెంబర్ 2న సీఎం జగన్ విజయవాడలో భరోసా ఇచ్చారు. జనవరి 2న రాజ్యసభ, ఫిబ్రవరిలో ఏపీఐఐసి ఛైర్మన్ పోస్టు ఇస్తామన్నారు. చివరకు ఏ పదవీ లేకుండా నన్ను వైసీపి పార్టీ, జగన్ అవమానించారు అని మోసం చేశారని ఆయన బుధవారం మీడియా సమావేశంలో వాపోయారు.