వంట గ్యాస్ సిలిండర్ పై వినియోగదారుల బిల్లులో ఉన్న మొత్తం కంటే అదనంగా చార్జీలు వసూలు చేయరాదని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దారులు, ఐఓసి, హెచ్ పి ఎల్, బిపిసి గ్యాస్ ఏజెన్సీల యాజమాన్యాలు, సేల్స్ ఆఫీసర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కొంతమంది ఏజెన్సీ యాజమాన్యులు వినియోధాలు నుంచి అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారన్నారు.