వ్యయ పరిశీలకులుగా నియమితులైన వారు అభ్యర్థులు పెట్టే ప్రతి రూపాయిని లెక్కించాలని, అన్ని పార్టీల పట్ల సమదృష్టితో చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ సిబ్బంది, వీడియో నిఘా బృందాలు తదితర సిబ్బందికి బుధవారం మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. వ్యయ పరిశీలకులు, సిబ్బంది చేయాల్సిన పనిని శిక్షకులు సూర్యనారాయణ కూలంకశంగా వివరించారు.