ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సైనికులను ఉత్సాహపరిచేందుకు గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో కలిసి ఆయన పర్యటిస్తున్న ఒడెసా ప్రాంతంపై రష్యా మిసైళ్లతో విరుచుకుపడింది. ఆ సమయంలో ఇరుదేశాల నేతలు దాడి జరిగిన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలోనే ఉన్నారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ఇరుదేశాల నేతలకు ఎలాంటి గాయాలు కాలేదు.