విశాఖపట్నంలో హృదయవిదారక ఘటన జరిగింది. హనుమాన్‌నగర్‌కు చెందిన ఎల్.సోమేష్ (39) క్యాన్సర్ సంబంధిత అనారోగ్యంతో 5వ తేదీ అర్ధరాత్రి సమయంలో మృతిచెందారు.
ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మానసిక స్థితి సరిగా ఉండదు. చిన్నకుమార్తె దిల్లీశ్వరి ఇంటర్ మొదటి ఏడాది చదువుతోంది. దిల్లీశ్వరి తండ్రి మృతి చెందిన బాధతోనే పరీక్ష రాసొచ్చి అంత్యక్రియలు నిర్వహించింది.