మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సరైన కారణం లేకుండా కార్యాలయాలకు డుమ్మా కొడుతుండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు నిన్న ‘నో వర్క్-నో పే’ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది.
దీని ప్రకారం ఉద్యోగులు విధులు హాజరు కాని రోజును ఆబ్సెంట్‌గా పరిగణించి ఆ రోజు వేతనాన్ని జీతం నుంచి మినహాయిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.