కేరళ హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కల కంటే మనుషుల ప్రాణాలు ముఖ్యమని పేర్కొంది. కుక్కల భయంతో పిల్లలు ఒంటరిగా స్కూల్కు వెళ్లేందుకు భయపడుతున్నారని పేర్కొంది.
వీధి కుక్కల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలని ఆదేశించింది. వీధి కుక్కలను సంరక్షించాలనుకునే వారిని ప్రోత్సహించి వారికి లైసెన్స్ లు ఇవ్వాలని స్పష్టం చేసింది.