తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఈ మూడు నెలలు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువే నమోదు కానున్నాయని ఐరాస వాతావరణ సంస్థ వెల్లడించింది.
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఈసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని చెప్పింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారిచేసింది.