శింగనమల మండల కేంద్రంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదానం కోసం గురువారం తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు 20వేల విరాళం అందించారు. శింగనమల చిన్న కాలువ వీధిలోని భవాని శంకర ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులకు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దండు శ్రీనివాసులు మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలని కోరారు. ఆ పరమశివుని ఆశీస్సులు శింగనమల మండల ప్రజలకు కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.