డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు చేయూత పథకాన్ని అమలు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్ అన్నారు. గురువారం తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో 2875 మంది లబ్ధిదారులకు 5 కోట్ల 39 లక్షల నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి డ్వాక్రా మహిళలు పాలాభిషేకం చేశారు.