ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుండగా ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా బ్లూ జెర్సీలోనే ఆ టీమ్ బరిలోకి దిగనుంది. అయితే కొత్త జెర్సీలో పెద్దగా మార్పులు చేయలేదు. ఇంతకుముందులానే బ్లూ, గోల్డ్ స్ట్రిప్స్ ఉన్నాయి. హార్ధిక్ నాయకత్వంలో ఈనెల 24న జీటీతో ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది.