మనిషి చనిపోయి చితిలో కాలుతుండగా, చర్మము అవయవాలు కరిగిపోతూ, ఎముకలు మంటలో ముక్కలవుతూ, ఆ మనిషి తల పట్టుమని పగిలిపోతుంటే అతడ్ని అందరూ వదిలేసిపోయేవారే.
ఆ సమయంలో మనిషి ఆత్మ ఆ బాధను నొప్పిని తట్టుకోలేక ఒంటరిగా క్షోభిస్తుంది. అప్పుడు ఆ మనిషికి తాను ఒంటరి కాదని, ఎప్పటికి అతనికి తోడుగా, అది స్మశానం అయినా అతనితో అక్కడే ఉంటానని ఆ పరమేశ్వరుడు భరోసా ఇచ్చి, అక్కడే ఉంటాడు.