జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆమంచి స్వాములు చీరాల ఇన్చార్జిగా రాజీనామా చేస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. స్వాములకు గిద్దలూరు టికెట్ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మొదటి నుంచి గిద్దలూరు టికెట్‌ను ఆమంచి స్వాములు కోరుతున్నారు. గిద్దలూరు టికెట్.. పొత్తులో టిడిపి నుంచి అశోక్ రెడ్డి పోటీ చేస్తున్నట్లు ఆమంచి స్వాములకు సిగ్నల్ ఇచ్చారు. దీంతో జనసేన పార్టీ ఇన్చార్జిగా రిజైన్ చేస్తున్నట్లు లేఖ రాశారు.