కాఫీలో ఎన్నో రకాలున్నప్పటికీ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్ కాఫీనే. మన జీవితంలో భాగమైన కాఫీకి ప్రపంచంలో రెండో ర్యాంక్ దక్కింది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫాం
టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నది. మొదటి ప్లేస్లో క్యూబాకు చెందిన ఎస్ప్రెస్సో నిలిచింది.