లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం ప్రారంభించింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ తన ఎన్నికల ప్రచారాన్ని'సంసద్ మే బీ కేజ్రీవాల్, తో ఢిల్లీ హోగీ ఔర్ ఖుష్ హాల్' నినాదంతో ప్రారంభించింది.ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో ప్రచారాన్ని ప్రారంభించారు. 4:3 ఫార్ములా సీట్ల పంపకంతో ఆప్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.