కుటుంబ కలహాలతో ఓ యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు. నీరు గట్టు వారి పల్లెలోని చౌడేశ్వరి నగర్లో ఉంటున్న విమల (24) బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. పండుగ కోసం ఇంటికి వచ్చిన ఆమె ఇంట్లో గొడవపడి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.