కొత్తపేట నియోజకవర్గంలో ఐదేళ్లుగా రహదారులు దుస్థితి పట్టించుకోని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎన్నికల సమీపిస్తుండటంతో హడావిడిగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పేరిట ఆర్భాటం చేస్తున్నారని జిల్లా టిడిపి అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జి విమర్శించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట లో శనివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.