బ్యాంకు ఉద్యోగులకు గుడ్న్యూస్. ఉద్యోగుల వార్షిక వేతనం 17 శాతం పెరుగనుంది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది.
దీంతో ప్రభుత్వం రంగ బ్యాంకులపై ఏటా రూ.8,284 కోట్ల భారం పడనుంది. ఈ పెంపుతో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. అలాగే అన్ని శనివారాలు సెలవులకు ఆలిండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఒప్పుకోగా, ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది.