కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డులో ప్రతి శుక్రవారం నిర్వహించే చింతపండు సంతలో ధర తగ్గుముఖం పట్టింది. గత వారానికి ప్రస్తుతానికి క్వింటాకు రూ. 500లు నుంచి రూ. 800లు వరకు తగ్గింది. మొత్తం 704 క్వింటాళ్లు చింతపండు మార్కెట్ కు వచ్చినట్లు యార్డు కార్యదర్శి రాంప్రసాద రావు, సూపర్వైజరు ఈశ్వర ప్రసాద్ తెలిపారు. ఫ్లవర్ క్వింటా సరాసరి ధర రూ. 7వేలు, కరిపురి రకం రూ. 13వేలు ధర పలికినట్లు వెల్లడించారు.