గుంతకల్లు నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ కు కేటాయించరాదని డిమాండ్ చేస్తూ తెలుగు దేశం పార్టీ మహిళలు శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయం వద్ద నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఆందోళన చేపట్టారు. నాయకురాళ్ళు సరోజమ్మ, అరుణ మాట్లాడుతూ కష్టకాలంలో నాయకులు, కార్యకర్తలకు అండగా ఉన్న పార్టీ ఇన్ ఛార్జ్ జితేంద్రగౌడ్ కు టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు.