మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో వుండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్పందన హాలునందు కనిగిరి పట్టణ సమాఖ్య ప్రతినిధులు, కనిగిరి మెప్మా సిబ్బందికి ప్రతిభా పురస్కారాలను అందించి సన్మానించారు. ఆయన మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా మహిళల పేరుతో అమలు జరుగుతున్నాయని అన్నారు.