కనిగిరి లోని స్థానిక పామూరు బస్టాండ్ సెంటర్ లో ఉన్న విద్యుత్ స్తంభం తీగలు ఊడిపోయి ప్రమాద స్థితిలో ఉందని సిపిఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కరెంట్ తీగ తెగి అల్యూమినియం తీగలు బయటకు వచ్చాయని విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోని కోరారు. ప్రజలను ప్రమాదం నుండి కాపాడాలని కోరారు. నిత్యంజనసంచారం ఉండే ప్రధాన కూడలి కనుక అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.