అల్లూరి జిల్లా అరకులోయలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. నందివలసలో జరిగిన జాతరకు వెళ్లి వస్తుండగా మూడు బైకులు అదుపు తప్పి ఢీకొన్నాయి.
మృతులు చినలబుడు ప్రాంతానికి చెందిన బురిటీ హరి, గొల్లారి అమలాకాంత్, లోతేరుకు చెందిన త్రినాథ్, భార్గవ్ గా గుర్తించారు. ప్రమాద స్థలంలోనే ముగ్గురు చనిపోగా అరకు లోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాలుగేళ్ల బాలుడు భార్గవ్, మరో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు.