ప్రజలకు జగన్ రూపాయి ఇచ్చి రూ.10 దోచుకుంటున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు రెవెన్యూ లోటు ఉందని, అయినా ప్రజలపై పైసా భారం లేకుండా చంద్రబాబు పాలించారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో రూ.వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. వారి హయాంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయన్నారు.