అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఉద్యోగోన్నతి కల్పించేందుకు సర్టిఫికెట్లను శనివారం పరిశీలిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులకు స్కూల్ అసిస్టెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఇస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. పరిశీలన అనంతరం ఉద్యోగన్నతి పొందిన వారికి కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు.