నెల్లూరు జిల్లా నవాబుపేటకు చెందిన కొప్పులు ప్రశాంత్-పుష్ప ఫిబ్రవరి 8న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ అన్నోన్యంగా కలిసి మెలిసి జీవిస్తున్నారు.
వెంకటాచలం మండలం కాకుటూరుకు భార్యాభర్తలిద్దరూ వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్ను ఆటో ఢీకొట్టింది. రోడ్డుపై పడిన ప్రశాంత్-పుష్పలను ఆర్టీసీ బస్సు తొక్కేయడంతో చనిపోయారు. వీరిద్దరి కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు. చనిపోయి మరొకరికి వెలుగునిచ్చారని పలువురు అభినందిస్తున్నారు.