కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించింది. ఇవి మహిళలకు సురక్షితంగా లేకపోవడంతో పాటు మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు తాము గుర్తించామని వెల్లడించింది. ఈ మేరకు 2021 నాటి ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ స్కీంను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.