శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మూలవిరాట్ను ఏడాదిలో రెండుసార్లు సూర్యకిరణాలు తాకడం ప్రత్యేకత.
ఉత్తరాయణం రెండు రోజులు (మార్చి 9, 10), దక్షిణాయణం రెండు రోజుల్లో (అక్టోబర్ 1, 2) సూర్యకిరణాలు తాకుతాయి. అయితే మబ్బులు, మంచు కారణంగా స్వామి వారిని సూర్య కిరణాలు నిన్న, ఈరోజు కూడా తాకలేదు.