నక్కపల్లి మండలం బోయపాడు సముద్రతీరం మహాశివరాత్రి అమావాస్య సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి జనసంద్రంగా మారింది. అనేక ప్రాంతాల నుంచి భక్తులు అమావాస్యను పురస్కరించుకొని సముద్ర స్నానాలు చేసేందుకు బోయపాడు తీరానికి వచ్చారు. ప్రతీ ఏటా శివరాత్రి అమావాస్య నాడు బోయపాడు తీరంలో జాతర జరగడం ఆనవాయితీగా వస్తోంది. వేలసంఖ్యలో భక్తులు వచ్చి సముద్రస్నానాలు ఆచరించారు. సీఐ విజయకుమార్ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.