ఏపీలో టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తులో ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీకి విభజన హామీలు పెద్ద గుదిబండగా మారనున్నాయనే చర్చ జరుగుతోంది.
ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం, రైల్వే జోన్ ఈ హామీలపై ఏం చెప్పాలి? అనే సందిగ్ధం బీజేపీని వెంటాడుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపుతామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇక ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు విషయంలో ఏం చేస్తుంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది.